Header Banner

71వ కంచి కామపీఠాధిపతిగా 27 ఏళ్ల ఆంధ్రా వాసి.. శుక్రవారం ఓ ప్రకటనలో..

  Sat Apr 26, 2025 12:16        Politics

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంకు చెందిన రుగ్వేద పండితుడికి అరుదైన గౌరవం లభించింది. తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా అన్నవరంకు చెందిన గణేశ్ శర్మ ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుత పీఠాధిపతి శ్రీశంకర్ విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను ఎంపిక చేసినట్లు సంస్థానానికి చెందిన చల్లా విశ్వనాథశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల 30న కాంచీపురం కామాక్షి ఆలయంలో ఆయనకు సన్యాస దీక్షను ప్రసాదిస్తారని విశ్వనాధశాస్త్రి పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

అన్నవరంకు చెందిన దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ 1998లో జన్మించారు. 2006లో వేద అధ్యయన దీక్షను స్వీకరించిన గణేశ్ శర్మ ద్వారకా తిరుమల ఆలయంలో వేద విద్యను అభ్యసించారు. యజుర్వేదం, సామవేదం, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించిన ఘనాపాటి గణేశ్ శర్మ కొన్నేళ్లుగా కంచి పీఠంలో శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు. గణేశ్ శర్మకు ఈ అరుదైన గౌరవం లభించడం పట్ల అన్నవరం క్షేత్రంలోని వ్రత పురోహితులు, అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GaneshSharma #KanchiKamakshiPeetham #71stShankaracharya #AndhraPradesh #Annavaram #SriShankarVijayendraSaraswati #Hinduism #SanyasaDiksha